మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా 'ఉప్పెన'. ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అవడం, సినిమాలో అసలు ట్విస్ట్ ముందుగానే లీక్ అవ్వడంతో సినిమాపై ఊహించని విధమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇక విడుదల తర్వాత ఆ అంచనాలకు రెట్టింపు విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 60 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మొదటి సినిమాతోనే వైష్ణవ తేజ్ ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టడం అంటే అది మామూలు విషయం కాదు.

వైష్ణవ తేజ్ అన్నయ్య సాయిధరమ్ తేజ్ చాలాకాలంగా ఇండస్ట్రీలో హీరోగా ఉన్న ఈ స్థాయి కలెక్షన్స్ ని అందుకోలేకపోయాడు. అయితే తొలుత ఈ సినిమా కథ కొంతమంది యువ హీరోల దగ్గరకు వెళ్లిందట. అందులో మొదటగా ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు మన న్యాచురల్ స్టార్ నానితో తీద్దాం అని అనుకున్నాడట. దీంతో కథ వినిపించగా.. నానికి కథ బాగా నచ్చింది. కానీ క్లైమాక్స్ బాగా రిస్క్ అనిపించి దాన్ని మార్చమన్నాడట నాని. అయితే బుచ్చిబాబు అందుకు ఒప్పుకోలేదట. దీంతో ఈ సినిమాని నాని వదులుకోవాల్సి వచ్చింది. నాని తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ దగ్గరికి కూడా ఈ స్టోరీ వెళ్ళిందట. అతనికి కూడా కథ బాగా నచ్చినా.. క్లైమాక్స్ కి భయపడి ఒప్పుకోలేదట.

అలా మొదట కొంతమంది యువ హీరోల చుట్టూ తిరిగిన ఈ కథ చివరికి మెగా మేనల్లుడు వైష్ణవ స్టేజ్ దగ్గరికి చేరింది. ఇక ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఈ కథను విని కచ్చితంగా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మి పంజా వైష్ణవ్ తేజ్ ని హీరోగా పెట్టి సినిమా తీయమని బుచ్చిబాబుతో చెప్పడంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక విడుదల తర్వాత సినిమా రిజల్ట్ ఎలా ఉందో మనమందరం చూసాం. ఇక మొదటి సినిమాతోనే వైష్ణవ తేజ్ స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఒకవేళ మన నేచురల్ స్టార్ నాని లేదా రాజ్ తరుణ్ కాస్త రిస్క్ తీసుకొని ఈ సినిమాని చేసుంటే వాళ్ల కెరీర్లో 'ఉప్పెన' ఒక మైల్ స్టోన్ మూవీగా గా మిగిలి ఉండేది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: