అంతకుముందు ఒక తమిళ సినిమా చేసినా సరే చిలసౌతో తెలుగు తెరకు పరిచయమైంది రుహాని శర్మ. ఆ సినిమాలో తన పాత్రతో ఆడియన్స్ కు దగ్గరైన ఈ అమ్మడు ఆ తర్వాత మళయాళంలో కమల సినిమా చేసింది. ఇక తెలుగులో హిట్ ఫస్ట్ కేస్, డర్టీ హరి సినిమాలో గ్లామర్ రోల్స్ చేసింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్న రుహాని శర్మ తెలుగులో హర్ చాప్టర్ 1 సినిమాలో కూడా నటిస్తుంది. అమ్మడి సినిమాలు ఎలా ఉన్నా ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా అమ్మడు చేస్తున్న బికినీ షోస్ అదరగొట్టేస్తున్నాయి.

లేటెస్ట్ గా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ తో తన అందాలతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది రుహాని. బ్లాక్ డ్రెస్ లో అమ్మడి అందాల విందు ప్రేక్షకులను పిచ్చెక్కించేస్తుంది. మరి ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేయడంలో అమ్మడి స్ట్రాటజీ ఏంటో కానీ చిలసౌలో తన నటనతోనే అందరిని ఆకట్టుకున్న రుహాని ఇలా గ్లామర్ షోలో బీభత్సం సృష్టిస్తుంటే కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు.

తను గ్లామర్ రోల్స్ లో కూడా పనికి వస్తానని చెప్పేందుకే రుహాని ఇలా రెచ్చిపోతుందా అని డౌట్ వస్తుంది. ఏది ఏమైనా రుహాని చేస్తున్న ఈ హాట్ షో ఆమెకి మంచి మైలేజ్ వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. రుహాని శర్మ తప్పకుండా ఏదో ఒకరోజు గొప్ప అవకాశాన్ని అందుకుని అందంతో అభినయంతో రెండిటితో ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఆమె గ్లామర్ ట్రీట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. బోలెడంత టాలెంట్ ఉన్నా అమ్మడికి ఛాన్స్ లు మాత్రం వేగంగా రావట్లేదు. బహుశా వచ్చిన ఆమెకి కథలు నచ్చక చేయట్లేదేమో కానీ రుహానికి ఛాన్స్ లు రావాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్.  


మరింత సమాచారం తెలుసుకోండి: