మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శ్రీ లీల ప్రస్తుతం వరస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. రోషన్ హీరోగా రూపొందినటు వంటి పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన డాన్స్ తో ... నటన తో ... అంద చందాలతో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూవీ లలో అవకాశాలను దక్కించుకుంటుంది.

అందులో భాగంగా ఇప్పటికే మహేష్ ... త్రివిక్రమ్ మూవీ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అలాగే బాలకృష్ణ ... అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్  లలో కూడా ఈ ముద్దు గుమ్మ అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మకు మరో అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో శ్రీ లీల కు హీరోయిన్ గ అవకాశం లభించినట్లు ... అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో శ్రీ లీల కు సంబంధించిన ఫోటో షూట్ ను కూడా ముగించినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమా అవకాశాలతో ప్రస్తుతం శ్రీ లీల అదిరిపోయే రేంజ్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: