తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు ను ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటు వంటి హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను మొదలు పెట్టిన ఈ దర్శకుడు ఆ తర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ... లై ... పడి పడి లేచే మనసు ... సీత రామం మూవీ లకు దర్శకత్వం వహించాడు.

ఇందులో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా మంచి విజయం సాధించగా ... సీత రామం సినిమా మాత్రం అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన మృనాల్ ఠాగూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాలను నడుమ విడుదల అయిన ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి. ఈ మూవీ ద్వారా హను రాఘవపూడి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడి తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ ప్రొడక్షన్ హౌస్ హలో ఒకటి అయినటు వంటి మైత్రి మూవీ సంస్థ లో చేయబోతున్నట్లు ... ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరి కొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: