పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించ నుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు సమాచారం. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు ... ఈ మూవీ మొదటి షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగనట్లు ఈ 10 రోజుల్లో ఈ సినిమా బృందం ఈ మూవీ లో నటించబోయే కీలక నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ అదిరిపోయి రేంజ్ కమర్షియల్ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం తో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే రెండవ సినిమా అయినటు వంటి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా అదిరిపోయే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: