జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు అలియాస్ వేణు వెల్దండి తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని చేసిన సినిమా బలగం. అంతకుముందు అతనేమి డైరెక్షన్ చేసిన అనుభవం లేకపోయినా మొదటి సినిమా అయినా కూడా అద్భుతంగా తెరకెక్కించాడని బలగం ప్రీమియర్స్ చూసిన వారు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ లో దిల్ రాజు కూతురు నిర్మించిందని అంటున్నారు. అయితే బలగం సినిమాపై మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటి అంటే బలగం సినిమా వేణు కొంతమంది సహాయంతో షూటింగ్ చేశారట.

సినిమా అవుట్ పుట్ చూసిన దిల్ రాజు నచ్చి అవుట్ రైట్ కొనేసి దానికి కొన్ని మెరుగులు దిద్ది సినిమా నిర్మాతగా తన పేరు వేయించుకున్నారని టాక్. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఉండదని అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేణు అంత బాహాటంగా దిల్ రాజు వల్లే ఈ సినిమా కల నిజమైందని చెప్పాడు. మరి నిజంగానే చివరి నిమిషంలో దిల్ రాజు వచ్చి ఉంటే వేణు చెప్పే మాటలని బట్టి అర్ధమయ్యేది. దిల్ రాజు మీద వేణు చూపించిన గ్రాటిట్యూడ్ చూస్తే బలగం మొదటి నుంచి దిల్ రాజు ఉన్నాడని అనిపిస్తుంది.

ఈ సినిమాలో ప్రియదర్శి కూడా మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడని అంటున్నారు. డైరెక్టర్ గా వేణు తన సత్తా చాటగా నటుడిగా ప్రియదర్శి మరోసారి మెప్పించాడని అంటున్నారు. మొత్తానికి కమెడియన్స్ డైరెక్షన్ చేస్తే సినిమాల ఫలితాలు బాగుంటాయని అంతకుముందు కొందరు ప్రూవ్ చేయగా ఈసారి వేణు కూడా అదే రిపీట్ చేశాడు. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ప్రధాన బలంగా మారిందని తెలుస్తుంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పాటలు రిలీజ్ కు ముందే శ్రోతలను అలరించాయి. తెలంగాణా నేపథ్యంతో పల్లెటూరి కథగా బలగం ప్రేక్షకుల ముందుకు శుక్రవారం వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: