కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ దర్శకుల కష్టాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు వరుస సూపర్ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన వివి వినాయక్ కృష్ణవంశీ పూరీజగన్నాథ్ గుణశేఖర్ రామ్ గోపాల్ వర్మల పేర్లు కొంతకాలానికి ప్రేక్షకులు మర్చిపోతారా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. ఒకప్పుడు అడ్వాన్సులతో నిర్మాతలు వారి వెంట తిరిగితే ఇప్పుడు వారికి అవకాశాలు ఇచ్చే నిర్మాతల కోసం వారు ఎదురు చూస్తున్నారు.  

 

 

వివి వినాయక్ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మాస్ సినిమాలకు చిరునామాగా కొనసాగిన ఇతడి వైపు ప్రస్తుతం ఏహీరో చూడటం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ను తీస్తున్నప్పటికీ ఆసినిమా ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ తెలియదు. చిరంజీవితో అత్యంత సన్నిహిత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ అతడికి ఎవరూ పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు.

 

 
మరోక సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ కష్టాలు కూడ ఈవిధంగానే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో మరాఠీ లో హిట్ అయిన మూవీని ‘రంగమార్తాండా’ గా పూర్తి చేసినప్పటికీ ఆసినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ తెలియదు. ఈసినిమాను ఏదోవిధంగా విడుదల చేద్దామని కృష్ణవంశీ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ అతడి ప్రయత్నాలు ముందుకు సాగడంలేదు అని అంటున్నారు. ఇక గుణశేఖర్ కష్టాలు మరింత విచిత్రంగా ఉన్నాయి.

 

 సమంతను నమ్ముకుని భారీ బడ్జెట్ తో ‘శాకుంతలం’ మూవీ తీసినప్పటికీ ఆమూవీ మార్కెట్ విషయంలో ఇప్పటికీ బయ్యర్ల నుండి సరైన స్పందన లేకపోవడంతో గుణశేఖర్ తనకు తాను ఆసినిమాను విడుదల చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. ఎందరో టాప్ హీరోలకు బ్లాక్ బష్టర్ హిట్స్ ఇచ్చిన పూరీజగన్నాథ్ పరిస్థితి కూడ ఇలాగే ఉంది. ‘లైగర్’ భారీ ఫ్లాప్ తో కనీసం పూరీ చెపుతున్న కథలు వినడానికి కూడ చాలామంది హీరోలు మొఖం చాటేస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలిస్టులో ట్రెండ్ సెటర్ గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఉండటం అత్యంత ఆశ్చర్యకరం..

మరింత సమాచారం తెలుసుకోండి: