అందాల రాక్షసి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు పోయిన సంవత్సరం దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా రూపొందిన సీత రామం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో అశ్విని దత్ నిర్మించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఈ మూవీ తో హను రాగవపూడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు మైత్రి సంస్థ లో చేయబోయే సినిమా భారీ బడ్జెట్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా హను రాఘవపూడి ... మైత్రి సంస్థ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ దర్శకుడు మైత్రి సంస్థలో నిర్మించబోయే సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన సూర్య హీరోగా నటించబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: