తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన అఖిల్ ఆఖరు గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు .

ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడు గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ అనే పవర్  ప్యాకుడ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు. మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని లాస్ట్ పాట చిత్రీకరణ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆఖరి సాంగ్ షూటింగ్ ను కూడా మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ పూర్తి చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: