యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన నట నతో ఇప్పటికే ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఎన్టీఆర్ ... రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటు వంటి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించి గ్లోబల్ గా తన క్రేజ్ ను పెంచుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇలా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మూవీ ద్వారా గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన కెరీర్ లో 30 వ మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో మరో బాలీవుడ్ క్రేజీ నటుడు కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ని ఎన్టీఆర్ 30 వ సినిమాలో విలన్ గా తీసుకునే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: