సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోను ... ఆ తర్వాత వరసగా విజయాలు లభిస్తూ ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనూ ... ఆ తర్వాత నటించిన రెండు మూవీ ల తోనూ విజయాలను అందుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు. సంయుక్త ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ మంచి విజయం సాధించడం సంయుక్త పాత్రకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ సినిమా అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసార అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరో గా రూపొందిన సార్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా నటించిన మూడు మూవీ లతో ఈ ముద్దుగుమ్మ మూడు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తన జోష్ ను చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: