టాలీవుడ్ హీరో సుధీర్ ఈ మధ్య వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటికే సుధీర్ "హంట్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన సుధీర్ ఈ పాత్రతో ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. 

తన పాత్రతో ప్రేక్షకులను బాగానే మెప్పించినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇలా హంట్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరచిన సుధీర్ ప్రస్తుతం మామ మశ్చీంద్ర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఈషా రెబ్బ ఈ సినిమాలో సుధీర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సుధీర్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ఈ మూవీ లో సుధీర్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనుండడంతో ఈ మూవీ యూనిట్ సుధీర్ ఈ సినిమాలో చేస్తున్న మూడు పాత్రలకు సంబంధించిన పోస్టర్ లను విడుదల చేసింది. మొదట ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో సుధీర్ నటిస్తున్న దుర్గ అనే పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. 

ఆ తర్వాత పరుశురామ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ డీజే అనే పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూడు పాత్రల్లో సుధీర్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ లలో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. మరి ఇలా మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్న సుదీర్ మామ మశ్చీంద్ర మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: