తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన పెళ్లి చూపులు మూవీ లో ఒక మంచి పాత్రతో ప్రేక్షకులను మెప్పించాడు. అలా తన నటనతో మెప్పించిన ప్రియదర్శి కి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కమెడియన్ పాత్రలలోనూ మరియు ఇతర ముఖ్య పాత్రలోను మరియు హీరో పాత్రలోను అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈ నటుడు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం ఎంతో బిజీ నటుడిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియదర్శి "బలగం" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు ఏప్రిల్ రెండవ వారం నుండి ఈ మూవీ ని అమెజాన్ వీడియో సంస్థ తమ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: