అసలు ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం ఒక చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది బలగం సినిమా. టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ కమెడియన్ ప్రియదర్శి ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో నటించారు.సుధాకర్ రెడ్డి, జయరాం, రోహిణి, రచ్చ రవి ఇంకా వేణు వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి మూడో తేదీన విడుదలై సూపర్ మౌత్ టాక్ తో భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకుపోతోంది.ఈ సినిమా కేవలం ప్రేక్షకుల నుంచే కాదు, సినీ విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మార్చి మూడవ తేదీన అంటే మొదటి రోజు 55 లక్షల వసూళ్ళని రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఆ తర్వాతి రోజు 80 లక్షలు ఇంకా మూడవరోజుకి ఏకంగా కోటి 75 లక్షలు అలాగే నాలుగవ రోజు 58 లక్షలు ఈ సినిమా వసూలు చేసింది.


ఇక ఐదవరోజు కూడా మొదటి నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఈ సినిమా ఏకంగా కోటి 80 లక్షలు వసూలు చేసింది.అలా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటిదాకా ఐదు కోట్ల 48 లక్షల గ్రాస్ వసూలు చేయగా... మొత్తం రెండు కోట్ల 35 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక సహా మిగిలిన ప్రాంతాల్లో అయితే 10 లక్షలు వసూలు చేయగా ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు కోట్ల 58 లక్షల గ్రాస్ ఇంకా అలాగే రెండు కోట్ల 40 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కేవలం కోటి 15 లక్షలు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోటి 30 లక్షలుగా రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమా ఇప్పటికే కోటి 10 లక్షల లాభాలతో స్పీడ్ గా దూసుకుపోతూ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదటి నాలుగు రోజులు సాదాసీదాగా వచ్చిన కలెక్షన్లు 5వ రోజు మాత్రం భారీగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: