సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలలో కొంత మంది తమ అంద చందాల తో ప్రేక్షకుల మనస్సులను దోచుకుంటూ ఉంటే మరి కొంత మంది మాత్రం తమ అద్భుతమైన నటన తో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించు కుంటూ ఉంటారు . అలా అద్భుతమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటీమణుల  లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ మొదట తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా గుర్తింపును సంపాదించుకుంది .

ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఐశ్వర్య రాజేష్ "కౌసల్య కృష్ణమూర్తి" అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మహిళా క్రికెట్ నేపథ్యంలో రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం అలరించ లేక పోయింది. కాకపోతే ఈ మూవీ లోని ఐశ్వర్య రాజేష్ నటన కు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐశ్వర్య రాజేష్ కు అనేక సినిమా అవకాశాలు లభించాయి. 


ప్రస్తుతం కూడా ఐశ్వర్య రాజేష్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దుcగుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఫోటో షూట్ ను నిర్వహించింది. ఆ ఫోటోలను ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: