టాలీవుడ్ ఇండస్ట్రీ లో సెకండ్ గ్రేడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నా రాశిఖన్నా గూర్చి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  చూడగానే బబ్లీగా కనిపించే రాశీఖన్నా ఎక్కువగా జాలీగా ఉండే క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటది.

ఐతే తనకంటూ ఒక ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న ఆమె యోధ అనే సినిమా తో బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు రెడీ అయింది. నిజానికి మద్రాస్‌ కేఫ్‌ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సెటిలైపోయింది. మధ్యమధ్యలో మలయాళ, తమిళ చిత్రాలు కూడా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

'నేను నటించిన మద్రాస్‌ కెఫె సినిమా అయిపోయాక ఒక రోజు రాజమౌళి సర్‌ బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఐతే ఆ మూవీ లో తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్‌ జరిగింది. నాకు పిలుపొచ్చింది, వెళ్లాను. కానీ రాజమౌళి సర్‌ నన్ను చూసి చాలా క్యూట్‌గా ఉందీ అమ్మాయి, ఏదైనా లవ్‌ స్టోరీకి బాగా సెట్టవుతుంది అన్నాడు అని ఆయన గూర్చి చెప్పింది. అలాగే ఆయన నా స్నేహితుడొకరు మంచి ప్రేమకథపై వర్క్‌ చేస్తున్నాడు. ఓసారి ఆ కథ విను, నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. అలా ఊహలు గుసగుసలాడేతో నేను తెలుగులో లాంచ్‌ అయ్యాను. కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్రైనా చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.

ఏదేమైనా రాజమౌళి లాంటి ప్రపంచ దిగ్గజ దర్శకుడు చేతిలో పడాలని చాలామంది స్టార్స్ భావించడం కరెక్టే కానీ రాజమౌళి గారు ఆ క్యారెక్టర్స్ పరంగా ఒక విజువల్ ఉన్నా వ్యక్తి. ఆ పాత్ర కి వాళ్ళు మాత్రమే సూటబుల్ అని అనుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని తన మూవీ లో చేయమని అడుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: