టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్నా క్రేజ్ గూర్చి చెప్పక్కర్లేదు. ఐతేఆ ఫ్యామిలీ నుండి వచ్చిన వారిలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలయ్య,కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్,  వాళ్లు కెరీర్ పరంగా సాధిస్తున్న విజయాలతో సంతోషంగా ఉన్నారు.ఐతే ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన వారిలో హరికృష్ణ గారు కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలు అందించారు. తర్వాత జనరేషన్ లో వచ్చిన తారకరత్న మాత్రం అభిమానులను సినిమాల పరంగా మెప్పించలేకపోయారు. ఆయన ఇటీవల గుండెపోటు తో మరణించిన సంగతి అందరికి తెల్సిందే.

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి కూడా గత ఐదేళ్ల నుంచి తరచూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి అనిల్ డైరెక్టర్ గా పని చేస్తున్నారని సమాచారం.

అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞ డ్యాన్స్, యాక్షన్ సీన్స్ లో శిక్షణ తీసుకుంటున్నారని నందమూరి ఫ్యాన్స్ ను మోక్షజ్ఞ ఏ మాత్రం నిరుత్సాహపరచరని తెలుస్తోంది. మోక్షజ్ఞ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో పాటు పబ్లిక్ లోకి రావాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.

మోక్షజ్ఞ ఇంటర్వ్యూల ద్వారా ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నందమూరి మోక్షజ్ఞ నెక్స్ట్ లెవెల్ కథలను ఎంచుకోవాలని, స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. మోక్షజ్ఞ తొలి ప్రాజెక్ట్ సొంత బ్యానర్ లోనే తెరకెక్కనుంది.

నందమూరి హీరోలలో మోక్షజ్ఞ నంబర్ వన్ హీరోగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ ఇతర హీరోలకు భిన్నంగా ముందడుగులు వేయలని అన్ని వర్గాల ప్రేక్షకుల మనస్సులను గెలుచుకోవాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞకు రాజకీయాలపై మాత్రం ఆసక్తితో లేరని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా మోక్షజ్ఞ పూర్తిస్థాయిలో సినిమాలకే పరిమితం కానున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మోక్షజ్ఞతో సినిమాలు తెరకెక్కించడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

ఏదేమైనా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా చూడాలని నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: