ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ చేసిన విషయం తెలిసిందే. అటు విదేశాల్లోనూ ఈ సినిమా ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది ఎట్టకేలకు ఆస్కార్ కు సైతం నామినేట్ అయి నాటు నాటు సాంగ్ తో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును గెలుచుకొని తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ఇక ప్రస్తుతం త్రిబుల్ ఆర్ చిత్ర బృందం సెలబ్రేషన్స్ మూడ్ లో ఉంది. ఇక తాజాగా లాస్ ఏంజిల్స్ లోని డైరెక్టర్ రాజమౌళి ఉంటున్న ఇంట్లో సోమవారం మూవీ టీం గ్రాండ్ పార్టీ చేసుకుంది. 95 వ ఆస్కార్ అవార్డ్స్ లో విజయం సాధించిన అనంతరం మూవీ టీం చాలా గ్రాండ్ గా పార్టీ చేసుకుంది.

ఆస్కార్ ఆనందాలని ఆస్వాదిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు .ఇక అభిమానులు ఈ ఫోటోలు వీడియోలు చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు .వీటిలో ఒక వీడియోలో కీరవాణి పియానో వాయిస్తూ ఉండగా మిగతా నటినట్లు అంతా ఉత్సాహంగా దాని వింటున్నారు. మరో వీడియో క్లిప్ లో రామ్ చరణ్ ఆస్కార్ గెలుచుకున్న అవార్డుతో పాటు ఇతర అవార్డులతో ఫోజులిచ్చాడు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటోలు వీడియోలు ఉన్నాయి .మొత్తం మీద త్రిబుల్ ఆర్ హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆకట్టుకుని గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకోవడంతోపాటు ఆస్కార్ అవార్డుతో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ వచ్చిందో ఆ క్షణం నుంచి మహేష్ బాబు రాజమౌళి సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. హాలీవుడ్ ని తెరదన్నేలా మహేష్ తో రాజమౌళి సినిమా ప్లాన్ చేస్తున్నాడు.సుమారు ఎనిమిది వందల నుండి 1000 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి పని చేస్తున్నారు రాజమౌళి. ఆఫ్రికన్ అడ్వెంచర్స్ డ్రామా నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటినట్టులను కూడా రాజమౌళి ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR