ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల జోరు కాస్త ఎక్కువగ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. సినిమాలో కాస్త మ్యాటర్ ఉంటే చాలు దానిని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి దేశం మొత్తం వీక్షించేలా నిర్మాతలు ప్లాన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాగా ... అందులో కొన్ని సినిమాలు మాత్రమే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలరించి ... భారీ బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ సినిమా లలో కబ్జా మూవీ ఒకటి. ఈ మూవీ లో ఉపేంద్ర ... కిచ్చా సుదీప్ లు హీరోలుగా నటించగా ... శ్రేయ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని మార్చి 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను కన్నడ తో పాటు తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కన్నడ , తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల ట్రైలర్ లను కూడా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.

మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి మంచినాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని తెలుగు లో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: