నిన్న జరిగిన ఆస్కార్ ప్రధానం అనేది మన తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రోజు. మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు లభించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ లభించడం ఒక ఎత్తైతే లభించడానికి ముందు వచ్చిన తర్వాత పురిటి నొప్పులు పడంత ప్రయాస పడాల్సి వచ్చింది రాజమౌళి అండ్ టీం.

కొంతమంది నెగటివ్ గా స్పందిస్తే మరి కొంతమంది పాజిటివ్ గా స్పందించారు ఏది ఏమైనా రాజమౌళి మాత్రం చరిత్రలో నిలిచిపోయే పని చేశాడు. అయితే రాజమౌళి సినిమాకు ఆస్కార్ అవార్డు అయితే లభించింది కానీ ఇక అతడు తీయబోయే సినిమాలపై మరింత బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఆయన తీస్తున్నాడు అంటే ఆస్కార్ రావడం ఖాయమని జనాలు అభిప్రాయపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆస్కార్ లభించింది కాబట్టి వచ్చే సినిమాలను మరింత జాగ్రత్తగా తీయాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం అశ్రద్ధ వహించిన దారుణమైన ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది.

అయితే కేవలం రాజమౌళి మాత్రమే కాదు. పుష్ప వంటి సినిమాలు, కాంతారా లేదా మరిన్ని సినిమాలు, తెలుగు అయినా వేరే భాష అయినా ఇండియాలో చాలా మంది ఇకపై ఆస్కార్ అవార్డుపై ఫోకస్ పెడతారు వారి సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని ఆశిస్తారు అందుకోసం అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశం లేకపోలేదు. కొంతమందికి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. అయినా కూడా ఆస్కార్ అవార్డుపై గురిపెట్టే వారి సంఖ్య ఖచ్చితంగా ఇకపై పెరుగుతుందని ఒప్పుకోవాల్సిందే. దీనివల్ల ఆ సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతుంది క్వాలిటీ కోసం ప్రయత్నించే దర్శకులు మరింత జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను ఎక్కువ కాలం తీసే అవకాశం లేకపోలేదు. ఒక విధంగా ఇది నిర్మాతలకు కత్తి మీద సాము లాంటిదే. హీరోలు కూడా ఆస్కార్ అవార్డు వచ్చే సినిమా తీయాలని పట్టుబట్టే అవకాశం ఉంటుంది. రాజమౌళికి సాధ్యమైన అవార్డు మిగతా వారికి సాధ్యం కాదు అని అనుకోవడానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆ అభిలాష ఉంటుంది. అయితే ఆస్కార్ కోసం పులిని చూసి నక్క లాగా వాతలు పెట్టుకోవద్దు అని కొంతమంది హితవు చెబుతున్నారు. దానికి సరిపడా కసరత్తు చేయడంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దని సినిమా బాగుంటే అవార్డు దానంతట అదే వస్తుంది అని చెప్తున్నారు. మరి చూడాలి ఇకపై ఈ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆస్కార్ వస్తుందా లేదా మొదటికే మోసం వస్తుందా అని తెలుసుకోవాలంటే ఎదురు చూడాల్సిందే.

కనుకనే ఏ డైరెక్టర్ కూడా దయచేసి నిర్మాతలని బడ్జెట్ దగ్గర ఇబ్బంది పెట్టకూడదు అని సోషల్ మీడియా వేదికగా నేటిజన్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: