టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో హీరో గా నటించినప్పటికీ ఛలో మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తో నాగ శౌర్య క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది.

ఛలో లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నాగ శౌర్య అనేక మూవీ లలో హీరో గా నటించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఛలో రేంజ్ విజయం మాత్రం నాగ శౌర్య కు ఇప్పటి వరకు లభించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో పలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా ... అవసరాల శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ మార్చి 17 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్  ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 9 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుండి ఇప్పటివరకు చిత్ర బంధం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుడు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: