తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో కామెడీ సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి అలాగే ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నరేష్ సినిమాల్లో హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా కొన్ని మూవీ లలో ఇతర ముఖ్య పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు.

అందులో భాగంగా కొంత కాలం క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించిన నరేష్ తన పాత్రతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. ఇది ఇలా ఉంటే నరేష్ కొంత కాలం క్రితమే మారేడుమిల్లి ప్రజానీకం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం నరేష్ "ఉగ్రం" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నాంది మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో నరేష్ సరసన మిర్న హీరోయిన్ గా నటించగా ... సాయి చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మొదటి పాట విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ నుండి "దేవేరి" అనే పాటను మార్చి 19 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: