తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో నాగ చైతన్య ఒకరు. నాగచై తన్య "జోష్" మూవీ తో హీరో గా కెరియర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఆఖరుగా పోయిన సంవత్సరం విడుదల అయిన థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో రాసి కన్నా హీరోయిన్ గా నటించగా ... విక్రమ్ కే కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఇలా థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ... ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ లో ప్రియమణి ... అరవింద స్వామి కీలక పాత్రలలో నటించగా ... కృతి శెట్టి ఈ మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది.

ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రస్తుతం కస్టడీ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 8.33 మిలియన్ వ్యూస్ ను ... 117.1 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి 24 గంటల్లో సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: