టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన మూవీ లతో అద్భుతమైన దర్శకుడు గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ వంశీ ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. చాలా కాలంగా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన కృష్ణ వంశీ తాజాగా రంగ మార్తాండ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ లో ప్రకాష్ రాజ్ ... రమ్య కృష్ణ ... బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. హౌస్‌ఫుల్ మూవీ స్, రాజశ్యామల ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో శివాత్మిక రాజశేఖర్ , రాహుల్ సిప్లిగంజ్ , ఆదర్శ్ బాలకృష్ణ , అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే విడుదలకు సిద్ధం అయిన ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ... కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: