
నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సిరీస్ లు అన్నింటినీ కూడా ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఇది కొత్తగా అనిపించకపోయినప్పటికీ కేవలం వెంకటేష్ ను ఫ్యామిలీ హీరోగా మాత్రమే చూస్తూ.. తెలుగు సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు మాత్రం రానా నాయుడు వెబ్ సిరీస్ ఆశ్చర్యపరుస్తూ ఉంది అని చెప్పాలి. ఇక కొంతమంది రానా నాయుడు వెబ్ సిరీస్ పై విమర్శలు చేస్తుంటే. మరి కొంతమంది మాత్రం ప్రేక్షకులు కోరుకున్న విధంగానే ఏదో కొత్తగా ట్రై చేశారు అంటూ మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ ట్రెండింగ్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి స్పందించిన టాలీవుడ్ సీనియర్ నటుడు శివకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఓటీటి కంటెంట్ కు కూడా సెన్సార్ ఉండాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. నిన్ననే ఒక వెబ్ సిరీస్ చూశాను. మరి దారుణంగా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. మొత్తంగా అది ఒక బ్లూ ఫిలిం లాగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. బెడ్ రూమ్ లో నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాలను హాల్లో పిల్లలకు చూపించడం ఏంటి.. ఇదేనా మన సంప్రదాయం అంటూ ప్రశ్నించారు శివకృష్ణ.