పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ షూటింగ్ ను కొంత భాగం పూర్తి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ ... సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతం అనే రీమేక్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే మూవీ లో నటించడానికి కమిట్ అయ్యాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నాలుగు మూవీ ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ యొక్క చివరి షెడ్యూల్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించడానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ... సముద్ర కని కాంబినేషన్ లో రూపొందుతున్న వినోదయ సీతం రీమేక్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు  ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మార్చి 22 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ... సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ లొకేషన్ లో కోసం వెతుకులాటలో ఈ మూవీ దర్శకుడు సుజిత్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ హీరోగా రూపొందే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం లొకేషన్ ల వేటలో హరీష్ శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: