తెలుగు ... తమిళ సినిమా ఇండస్ట్రీ లలో తనకంటూ నటుడు గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆది తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని మూవీ లలో హీరో పాత్రలలో నటించగా ... మరి కొన్ని మూవీ లలో విలన్ పాత్రలో ... మరి కొన్ని సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ యువ నటుడు రామ్ పోతినేని హీరోగా లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా ఈ మూవీ లో ఆది మాత్రం తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది పినిశెట్టి ... నాని హీరో గా రూపొందిన దసరా మూవీ ట్రైలర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ పై ఆది పినిశెట్టి తాజాగా స్పందిస్తూ ... దసరా మూవీ ట్రైలర్ రియల్, రా మరియు రస్టిక్ అని ... ట్రైలర్ అదిరిపోయింది అని ... నాని బాబాయ్ ... కీర్తి సురేష్ ఇది మీ బెస్ట్ లలో ఒకటి అని ఆది పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: