నెట్ ఫ్లిక్స్ లో ‘రానా నాయుడు’ స్ట్రీమింగ్ మొదలై 10 రోజులు దాటిపోయినప్పటికీ ఆ వెబ్ సిరీస్ పై విమర్శలు ఆగడంలేదు. ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఈ వెబ్ సిరీస్ పై తీవ్రమైన నెగిటివ్ కామెంట్స్ కనిపించాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ప్రముఖుడు కూడ ఈవెబ్ సిరీస్ పై ఓపెన్ గా స్పందించలేదు.



అయితే సీనియర్ నటుడు ఒకప్పుడు విప్లవ సినిమాలలో బాగా నటించి మెప్పించిన శివకృష్ణ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ను టార్గెట్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 'నిన్న‌నే ఓ వెబ్ సిరిస్ చూశాను. మ‌రి దారుణంగా ఉంది. మొత్తం ఓ బ్లూ ఫిలింలాగా ఉంది. బెడ్ రూంలో జ‌ర‌గాల్సిన అంశాల‌ను హాల్లో కూర్చున్న పిల్ల‌ల‌కు చూపించ‌డం ఏంటి?' అంటూ మండి ప‌డ్డాడు. దీనితో శివకృష్ణ అన్నమాటలు ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ను ఉద్దేసించినవే అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.



అంతేకాదు శివకృష్ణ మరో అడుగు ముందుకు వేసి ఈ మ‌ధ్య‌కాలంలో చాలా మంది యువ‌త పాడైపోవడానికి ఇలాంటి ఓటీటీ సినిమాలు వెబ్ సిరిస్ లే కార‌ణం అంటూ ఓటీటీ లపై సెన్సార్ ఉండాలి అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేసాడు. తాను సెన్సార్ బోర్టు చైర్మ‌న్ గా ఉన్న‌ప్పుడు  ఇలాంటి అంశాల‌ గురించి చాల దృష్టి పెట్టానని ఆఖరికి సినిమా ట్రైలర్స్ పై కూడ సెన్సార్ ను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేసాడు.


వాస్తవానికి ఓటీటీ లపై సెన్సార్ ఉండాలి అన్న డిమాండ్ చాల ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంలో కేంద్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదో చాలామందికి అర్ధం కావడంలేదు. దీనికితోడు ఓటీటీ లు అందులో వచ్చే వెబ్ సిరీస్ ల సంఖ్య వేలల్లో ఉండటంతో వాటిని నిమంత్రించడం కష్టం అనీ ఎవరికీ వారే స్వయంనియంత్రణ అలవాటు చేసుకోవాలని సూచనలు వస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: