బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా పఠాన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన హిందీ , తెలుగు , తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: