ఉగాది సందర్భంగా విడుదల అవుతున్న దాస్ కా ధమ్కీ సినిమా గురించి అంచనాలు చాల బాగా ఉన్నాయ్. ఈ సినిమాకు హీరో గా విశ్వక్ సేన్ నటించగా, అతడే దర్శకత్వం మరియు నిర్మాణం చేపట్టడం విశేషం. ఈ విషయం పై ఆ సినిమాలో నటించిన నివేద పేతురాజ్ తాజాగా స్పందించారు. ఎవరైనా హీరో గా నటించడం వరకు  చాల సులభంగా చేయగలరు. కానీ ఒక పక్క హీరోగా నటిస్తూ మరో వైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా చేయడం అనేది మాములు విషయం కాదు అంటూ విశ్వక్ సేన్ పై ప్రశంసల వర్షం కురిపించారు ఆ చిత్రం లో నటిస్తున్న హీరోయిన్ నివేద. ఇది వరకే పాగల్ సినిమా లో విశ్వక్ కి హీరోయిన్ గా నటించిన నివేద ఇప్పుడు దాస్ కా ధమ్కీ సినిమాలో సైతం అతడితో జత కట్టింది. నివేద ఈ చిత్రంలో తొలిసారి మంచి డ్యాన్స్ కి స్కోప్ ఉన్న పాత్రా చేసినట్టు గా చెప్తుండటం విశేషం.  ఇక విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ హీరో గా విశ్వక్ తన సొంత సినిమాలకు మాత్రమే కాకుండా డైరెక్షన్ పరం గా మిగతా హీరోలను కూడా చేస్తే బాగుంటుంది అని నివేద తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక తనకు మరియు విశ్వక్ కి ఈ సినిమా మంచి చిత్రం గా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పారు. మరో వైపు నివేద పేతురాజ్ కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా పలు బిజినెస్ లు కూడా చేస్తుంది. రెస్టారెంట్స్ , ఫ్లవర్ షాప్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. నివేద సైతం తనను తాను తెర పై ఒక దర్శకురాలిగా చూసుకోవాలి అని అనుకుంటున్నా దానికి ఇంకా చాల సమయం ఉందని చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: