తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుల్లో త్రినాథ్ రావు నక్కిన ఒకరు. ఈ దర్శకుడు ప్రియతమా నీవచట కుశలమా అనే మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత పలు మూవీ లకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన సినిమా చూపిస్త మామ మూవీ తో మంచి కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించు కున్నాడు.

ఆ తర్వాత నేను లోకల్ మూవీ తో మరో కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా రూపొందిన హలో గురు ప్రేమ కోసమే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన ధమాకా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ పోయిన సంవత్సరం విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ధమాకా మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని ఎవరితో చేస్తాడు అనే ఆసక్తి చాలా మందిలో నెలకొంది. ఇక తాజాగా టాలీవుడ్ బజ్ ప్రకారం నాగ శౌర్య తల్లి అయిన ఉషా మూల్పూరి నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ వారి సినిమాకు త్రినాథ్ రావు నక్కిన పని చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బ్యానర్ లో సినిమాకు సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: