మార్చి 30న విడుదలైన దసరా సినిమా మంచి పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. నాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ఈ సినిమాకి అతడి కెరీర్ లోనే ఇప్పటివరకు రానంత హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా కూడా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకు చాలామంది స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని ఒక థియేట్రికల్ షేర్ ను వసూలు చేసి ఈ చిత్రం మంచి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దసరా చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే 18 కోట్ల రూపాయలకు పైగా వసూలుగా సాధించి తన బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేస్తుంది దసరా చిత్రం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 49 కోట్ల టార్గెట్ తో విడుదల కాగా , ఇప్పటికే 50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది..

ఇక కలెక్షన్స్ సంగతి కాసేపు పక్కన పెడితే దసరా సినిమా గురించి కొన్ని విషయాలను తెలుసుకునేందుకు మాత్రం ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించిన విషయం ఏంటి అంటే  సిల్క్ స్మిత బార్. బార్ కి ఆమె పేరు ఎందుకు పెట్టారు అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే దీనికి సమాధానంగా ఇటీవల ఇంటర్వ్యూలో సినిమా యూనిట్ కి చెందిన ఒక వ్యక్తి సమాధానం చెప్పారు. చిన్నతనం నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తాత గారికి ప్రతి రోజు బారుకు వెళ్లి మందు తాగే అలవాటు ఉండేదట.


 అక్కడ తన తాత తో పటు దర్శకుడు శ్రీకాంత్ కూడా ప్రతి రోజు వెళ్లి ఆ బార్ లో ఉన్న సిల్క్ స్మిత ఫోటో చూసి ఆశ్చర్యపోయే వాడట. ఆమె ఎవరో కూడా అతనికి తెలియక పోయినప్పటికీ సిల్క్ స్మిత రూపం దర్శకుడు శ్రీకాంత్ కి బాగా నచ్చి ఎంతో ఆకర్షణకు గురయ్యాడట. ఇక తన సినిమాలో  సింగరేణిలో ఉన్న ఒక బార్ కి కచ్చితంగా సిల్క్ స్మిత పేరు పెట్టాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడట. అందుకే మన తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది పెద్ద నటీమణులు ఉండగా సిల్క్ స్మిత అనే పేరు నే తన బార్ కి పెట్టుకున్నాడు శ్రీకాంత్ ఓదెల.

మరింత సమాచారం తెలుసుకోండి: