తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో సుధీర్ వర్మ ఒకరు. ఈ దర్శకుడు నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా రూపొందిన స్వామి రారా మూవీ తో మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీ లకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... అను ఇమాన్యుయల్ ... ఫరియ అబ్దుల్లా ... పూజిత పొన్నాడ ... దక్ష నాగర్కర్ ... మేఘ ఆకాష్మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ సినిమా దర్శకుడు సుధీర్ వర్మ "రావణాసుర" మూవీ లోని రవితేజ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా సుదీర్ వర్మ మాట్లాడుతూ ... రమణాసుర మూవీ పూర్తిగా రవితేజ సినిమా. నేను అనుకున్న దాని కంటే రవితేజమూవీ లో చాలా మెరుగ్గా నటించాడు. రావణాసుర మూవీ లోని రవితేజ నటన తన కెరియర్ లోనే టాప్ 3 సినిమాలలో ఉంటుంది అని సుదీర్ వర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: