తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో దక్ష నాగర్కర్ ఒకరు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే పలు మూవీ లలో నటించి తన అందచందాలతో ... నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందినటువంటి రావణాసుర మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే దక్ష క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య హీరోలుగా రూపొందినటువంటి బంగార్రాజు మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బంగార్రాజు మూవీ సమయంలో నాగ చైతన్య ప్రవర్తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ చైతన్య గురించి దక్ష నాగర్కర్ మాట్లాడుతూ ...  తోటి నటీ నటులకు పై ఆయన చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అని ... బంగార్రాజు మూవీ లో ఆయన తో కలిసి నటించడం నా అదృష్టం అని ... ఆ మూవీ లో నన్ను పట్టుకోవడానికి ... ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు అని ... షూటింగ్ పూర్తి కాగానే నాకు సారి కూడా చెప్పేవారు. ఆయన ఒక జెంటిల్ మ్యాన్ అని దక్ష చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: