టాలీవుడ్ లెజెండరి స్టార్ హీరోస్ అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జునల నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అక్కినేని అఖిల్. కేవలం ఏడాది వయసులోనే సిసింద్రీ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో లాక్కొచ్చి రికార్డు సృష్టించాడు.తన తండ్రి అక్కినేని నాగార్జున నిర్మాణంలో 1994 వ సంవత్సరంలో వచ్చిన సిసింద్రీ మూవీతో బెస్ట్ చైల్డ్ అర్టిస్ట్ గా అవార్డు తీసుకున్నాడు అఖిల్. ఆ తరువాత పెద్దయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కినేని అఖిల్ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్ 8). అక్కినేని నాగార్జున, అక్కినేని అమల దంపతులకు 1994 ఏప్రిల్ 8 వ తేదీన అఖిల్ జన్మించాడు. అక్కినేని నాగ చైతన్య అఖిల్ కు అన్న .2016 వ సంవత్సరంలో జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ తో అఖిల్ కు నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహం రద్దైంది.అఖిల్ 2015లో 'అఖిల్' మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు అఖిల్.


సినిమా ఆశించినంతా నడవకపోయినా అఖిల్ ఎంట్రీ మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. ఇక 2017లో వచ్చిన హలో, 2019లో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక 2021లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీతో అఖిల్ ఫస్ట్ హిట్ కొట్టాడు. కానీ ఆ సినిమా అఖిల్ కి స్టార్ హీరో ఇమేజ్ తీసుకురాలేకపోయింది. ఇక ఎలాగైనా స్టార్ హీరో ఇమేజ్ కోసం అఖిల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న 'ఏజెంట్' సినిమాలో నటిస్తున్నాడు. 2014 వ సంవత్సరంలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులు నటించిన విక్రమ్ కుమార్ హిట్ ఫ్యామిలీ డ్రామా మనంలో అఖిల్ మొదటి సారి అతిథి పాత్రలో కనిపించి అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక ఏజెంట్ సినిమాతో అఖిల్ ఎలాంటి హిట్టుని కొడతాడో చూడాలి. ఈ సినిమాతో అఖిల్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాలనుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: