మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తమిళ మూవీ లలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కొంతకాలం క్రితం విడుదల అయినటువంటి తిరు మూవీ లో కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి కళ్యాణం కమనీయం అనే తెలుగు మూవీ లో ప్రియ హీరోయిన్ గా నటించింది. 

సంతోష్ శోభన్ హీరో గా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ రాఘవ లారెన్స్ హీరోగా కతరేశన్ దర్శకత్వంలో రూపొందిన రుద్రుడు మూవీ లో లారెన్స్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల కాబోతోంది.  ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ విజయం దక్కుతుందో చూడాలి. 

ఇలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ లో కూడా ఫుల్ యక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రియ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ను ధరించి ... బ్లాక్ కలర్ టీ షర్ట్ ను వేసుకొని ... నెత్తికి బ్లాక్ కలర్ లో ఉన్న క్యాప్ ను పెట్టుకొని ... చేతికి వాచి పెట్టుకుని అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: