సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ సరసన పూజ హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ మూవీ బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క చిత్రీకరణను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తూ వస్తుంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో జయరామ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి మహేష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్  పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ సిగరెట్ తాగుతూ స్టైలిష్ లో నడుచుకుంటూ వస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత మహేష్ ఈ మూవీ లో సిగరెట్ తాగుతూ కనిపించడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానుల్లో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమై ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ నాలుగో వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ నాలుగో వారం నుండి ప్రారంభం కాబోయే ఈ మూవీ షెడ్యూల్ చాలా రోజుల పాటు కొనసాగనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: