తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శివ నిర్వాణ ఒకరు. ఈ దర్శకుడు నాని హీరోగా నివేత థామస్ హీరోయిన్ గా రూపొందిన నిన్ను కోరి మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా సమంత హీరోయిన్ గా రూపొందిన మజిలీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

 ఆ తర్వాత నాని హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందినటువంటి టక్ జగదీష్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ లభించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా ఖుషి అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.

మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి ఖుషి అని టైటిల్ పెట్టడానికి గల కారణాలను ఈ మూవీ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథ రాయగానే హీరోయిన్ పాత్రకు సమంత అయితేనే న్యాయం చేయగలదని అనిపించింది అని ... విజయ్ ... సమంత కెమిస్ట్రీ ఈ మూవీలో చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. అలాగే  గతంలో పవన్ "ఖుషి"  ఫీల్‌గుడ్ మూవీ. ఈ సినిమాలో అంతే ఫీల్ ఉంది. అందుకే ఈ మూవీ కి "ఖుషి" పేరే పెట్టాం అని శివ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: