కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ కం హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో మొదట ఓ సాదాసీదా డాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత తన డాన్స్ టాలెంట్ తో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా తనలోని నటుడిని ఆవిష్కరించాడు. అలా హీరోగా కూడా మారి పలు సూపర్ హిట్ సినిమాలో నటించాడు.ఇక ఆపై డైరెక్టర్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలా సినీ  ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న లారెన్స్ కి ఎంతో గొప్ప మనసు ఉంది. ముఖ్యంగా లారెన్స్ లో ఉన్న గొప్ప గుణం సేవాగుణం. తన చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను అనుభవించిన లారెన్స్ ఇప్పుడు వేలాదిమంది అనాధ పిల్లలను దత్తత తీసుకొని తన సొంత ఖర్చుతో వారిని చదివిస్తూ వారి బాగోగులను చూసుకుంటున్నాడు. 

అలాగే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి వైద్య సేవలను అందిస్తున్నాడు. అటువంటి గొప్ప మనసు కలిగిన రాఘవ లారెన్స్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. తాజాకా మరో 150 మంది పిల్లలను దత్తత తీసుకున్నాడు లారెన్స్. ఇక 150 మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తానంటూ వాగ్దానం చేశాడు. ఇందుకు తనకు సినీ ప్రేక్షకుల నుంచి ఆశీస్సులు కావాలని కోరాడు. ఇక తాను తాజాగా నటిస్తున్న రుద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆ 150 మంది చిన్నారులతో కలిసిన దిగిన ఫోటోను లారెన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నెటిజన్లు రాఘవ లారెన్స్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ అతని గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఇక గతంలోనూ రాఘవ లారెన్స్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. గతంలో 141 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించి వార్తల్లో నిలిచాడు. కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించాలన్న, ఆర్థిక సమస్యల కారణంగా చదువుకోలేకపోతున్నా వెంటనే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించమంటూ రాఘవ లారెన్స్ స్వయంగా కోరారు. దీంతో రాఘవ లారెన్స్ గొప్ప మనసుకి సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక లారెన్స్ సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఈ హీరో నటించిన రుద్రుడు మూవీ ఈనెల 14న రిలీజ్ కానుంది. మదర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాని కతిరేషన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో లారెన్స్ సరసన భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. నాజర్, రాధిక శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: