బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కిసీ కా భాయ్ కీసి కి జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ట్రైలర్ విడుదలైంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ అటు ప్రేక్షకులు అందరిని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదలవుతూ ఉండగా ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం  చిత్ర బృందం  బిజీబిజీగా ఉంది. ఇకపోతే సల్మాన్ ఖాన్ సినిమాలో అటు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే కిసీ కా భాయ్ కీసి కి జాన్ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ తో నటించిన యువ నటి పాలక్ తివారి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ సినిమా సెట్ లో పనిచేసే ప్రతి మహిళా ఒక నిబంధనను తప్పకుండా పాటించాలి. ఈ విషయం చాలామందికి తెలియదు అంటూ పాలక్ తివారి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయం అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ సల్మాన్ ఖాన్ కి ఒక రూల్ ఉంది.



 అదేంటంటే సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన సెట్ లో పనిచేసే ప్రతి మహిళా కూడా శరీరం కనిపించకుండా మంచి దుస్తులు ధరించాలి. డీప్ నెక్ ఉండే షర్టుని వేసుకోకూడదు. ఈ విషయం మా అమ్మకు తెలిసి ఎంతో సంతోషించింది. సల్మాన్ ఇలాంటి రూల్ పెట్టడానికి కారణం ఏంటంటే.. ఆయన సాంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తారు. తన చుట్టూ ఉండే మహిళలకు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. సినిమా సెట్స్ లో పరిచయం లేని వ్యక్తులతో పనిచేస్తుంటే.. మహిళల భద్రతకు భంగం వాటిళ్ల కూడదు అనే ఉద్దేశంతో ఇక ఆయన సెట్స్ లో ఇలాంటి రూల్ పెడతాడు అంటూ పాలక్ తివారి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: