క్రితం సంవత్సరం విడుదలైన ‘బింబిసార’ ఇండస్ట్రీ వర్గాలు ఎవరు ఊహించని ఘన విజయం అందుకోవడంతో అందరి దృష్టి ఆమూవీ దర్శకుడు వశిష్ట పై పడింది. వాస్తవానికి అతడు మళ్ళీ కళ్యాణ్ రామ్ తో ‘బింబిసార 2’ సీక్వెల్ తీస్తారు అని ప్రచారం జరిగినప్పటికీ అది రకరకాల కారణాలతో కార్యరూపం దాల్చలేదు.


ఈలోపు సూపర్ స్టార్ రజనీకాంత్ వశిష్ట గురించి తెలుసుకుని అతడిని తన వద్దకు పిలిపించుకోవడంతో త్వరలో రజనీకాంత్ అతడి సినిమాలో నటిస్తాడు అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాసింది. అయితే జరిగింది మాత్రం వేరు యంగ్ దర్శకులను విపరీతంగా నమ్ముతున్న చిరంజీవి ఈమధ్య వశిష్ట ను తన దగ్గరకు పిలిపించుకోవడం అతడు చెప్పిన ఒక కథకు ఓకె చెప్పడం జరిగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.


ఈమూవీ కథ కూడ చిరంజీవి గతంలో నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మూవీలా ఒక ఫ్యాంటసీ మూవీ అన్నవార్తలు గుప్పుమంటున్నాయి. ఈమూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తీస్తుందని ఈమూవీలో కూడ గ్రాఫిక్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు. దర్శకుడు బాబికి ‘వాల్టేర్ వీరయ్య’ మూవీ చేసే అవకాశం ఇచ్చి బ్లాక్ బష్టర్ హిట్ కొట్టినట్లుగా ఈసారి చిరంజీవి వశిష్ట ప్రతిభ పై నమ్మకం పెట్టుకున్నాడు అనుకోవాలి.

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ పై పెద్దగా అంచనాలు లేవు. సిస్టర్ సెంటిమెంట్ తో ఉండే ఈమూవీ కథ ఎంతవరకు నేటితరం యూత్ కు కనెక్ట్ అవుతుంది అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి. అయితే ఈమూవీ నిర్మాణంలో దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవి సూచనలను బాగా పాటిస్తున్న పరిస్థితులలో ఈమూవీ కూడ హిట్ అయ్యే ఆస్కారం ఉంది అంటూ మెగా అభిమానులు లెక్కలు కడుతున్నారు. ‘వాల్తేర్ వీరయ్య’ తో మెగా స్టామినాను మరొకసారి రుచిచూపించిన చిరంజీవి ‘భోళా శంకర్’ తో ఎలా విజయం అందుకుంటాడో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: