మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది . ఈ మూవీ తోనే మంచి విజయాన్ని దక్కించుకొని ... అద్భుతమైన గుర్తింపును కూడా కృతి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది . దానితో కృతి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలు దక్కాయి .

అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లలో నటించిన కృతి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరో గా రూపొందిన కస్టడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు.  వెంకట ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ... అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తాజాగా ఓ భారీ క్రేజ్ ఉన్న తమిళ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కార్తి హీరో గా సూదు కవ్వం మరియు నలన్ కుమారసామి దర్శకత్వంలో రూపంతో పోయే మూవీలో ఈ ముద్దు గుమ్మకు హీరోయిన్ గా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న కార్తి సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు లభించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: