పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ నటించిన ఏ మూవీ అయినా ... దానికి ఎలాంటి టాక్ వచ్చిన సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతూ ఉంటాయి. ఆ రేంజ్ స్టార్ స్టామినా ఉన్న పవన్ ప్రస్తుతం అనేక మూవీ లకు కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి చేసిన పవన్ "వినోదయ సీతం" అనే తమిళ మూవీ కి రీమిక్ గా రూపొందుతున్న సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భవదీయుడు భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నాడు. ఈ మూవీ లతో పాటు సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే మూవీ కి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ రేపటి నుండి ముంబై లో ప్రారంభం కాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన తేదీనే ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవన్ ఫేస్ కనిపించకుండా డిఫరెంట్ గా ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు ఈ చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో కూడా అద్భుతంగా ఉండడం ... డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇలా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: