నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయినటు వంటి వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైర్ మూవీ కి మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది. 

తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా ... హనీ రోజ్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన 100 రోజుల ఫంక్షన్ కు తేదీ ని ఖరారు చేసింది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా విడుదల చేసింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ వీర సింహా రెడ్డి మూవీ యొక్క 100 రోజుల సెలబ్రేషన్స్ ను ఏప్రిల్ 23 వ తేదీన చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: