తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి శింబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న శింబు చాలా సంవత్సరాల క్రితం తమిళంలో రూపొందిన మన్మధ మూవీ ని తెలుగు లో విడుదల చేసి ఈ మూవీ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకొని మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత నుండి శింబు తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల పాటు వరుస ఆపయజాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న ఈ హీరో మానాడు మూవీ తో మంచి సక్సెస్ ను అందుకొని తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. తాజాగా శింబు "పాతు తాల" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 27 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ కి ... ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: