అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత అనేక తమిళ , హిందీ సినిమా లలో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకున్న కాజల్  కొన్ని రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. ఇది ఇలా ఉంటే పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా కాజల్ కు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూవీ లలో అవకాశాలు దక్కుతున్నాయి.

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కూడా ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం కాజల్ ... బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు మూవీ లోను ... కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 అనే తమిళ మూవీ లోను నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కాజల్ "కోస్టీ" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందు కోలేక పోయింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సందడి చేయబోతుంది. 23 ఏప్రిల్  2023 న జీ తెలుగులో ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని సీడ్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఈ మూవీ లో యోగి బాబు , రెడిన్ కింగ్స్లీ , రాధిక శరత్‌కుమార్ , ఊర్వశీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: