బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ బాలీవుడ్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వరస అపజయలతో డీలా పడిపోయిన షారుక్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

తాజాగా షారుక్ "పఠాన్" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం షారుక్ "జవాన్" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ సినిమాలో షారుక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రియమణిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ ఇప్పటికీ జర్మనీ లో ఈ మూవీ టికెట్ బుకింగ్ లను ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఇలా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఈ సినిమా టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేశారు అంటే షారుక్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: