బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా కిసి కా భాయ్ కీసి కా జాన్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ పూజా హెగ్డే ... సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

 ఫర్హాధ్ సంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సల్మాన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు కూడా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున ధియేటర్ లలో విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం భారీ మొత్తం లో కలక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు "యూఎస్" ప్రాంతంలో 55 కే డాలర్ ల కలెక్షన్ లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా కూడా ఏప్రిల్ 21 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మూడవ రోజు యూఎస్ ఏరియాలో 62 కే డాలర్ ల కలెక్షన్ లను వసూలు చేసి సల్మాన్ మూవీ ని బీట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: