మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటువంటి సూపర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక అవకాశాలను దక్కించుకుంది.

అనుష్క తన కెరీర్ లో కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక తమిళ మూవీ లలో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే అనుష్క కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇది ఇలా ఉంటే రుద్రమదేవి ... బాహుబలి సిరీస్ మూవీ లతో అనుష్క అద్భుతమైన నటిగా గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ... అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుష్క ... నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న మిస్ శెట్టి  మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని ఈ సంవత్సరం సమ్మర్ లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అనుష్క ట్విట్టర్ ప్లాట్ ఫామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించింది. 2020 వ సంవత్సరం ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన అనుష్క తాజాగా 1 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: