మలయాళీ నటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సంయుక్త ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన వెండి బింబిసార సినిమాలో కూడా నటించి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అనంతరం ఇటీవల సార్ సినిమాలో కూడా నటించి మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు మరోసారి సాయి ధరం తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో సైతం నటించింది. 

సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇలా వరుసగా నటించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో ఈమెది ప్లాటినం లెగ్ అంటూ అందరూ తెగ పొగిడేస్తున్నారు. ఇక కథల ఎంపిక విషయంలో ఈమె ఆచీతూచి అడుగులు వేయడంతో దర్శక నిర్మాతలు సైతం తన ముందుచూపు చూసి ముచ్చట పడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు ఇప్పుడు టాటూ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న ఎందరో హీరోయిన్లు టాటూలు వేయించుకుంటున్నారు.తాజాగా ఆ లిస్ట్ లోకి చేరింది సంయుక్త .ఈమె తన షోల్డర్ పై  టాటూ వేయించుకుంది. 

కానీ ఆ టాటూ మలయాళం లో ఉంది. దాంతో ఆ టాటూ అర్థం ఏంటి అన్నది ఎవరికి తెలియడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ అటాటో అర్థం ఏంటి అనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా సంయుక్త మీనన్ స్వయంగా తన టాటూ కి అర్ధాన్ని తెలియజేసింది.  తన షోల్డర్ పై ఉన్న టాటూ కి అర్థం సంచారి అని చెప్పింది.రెండేళ్ల క్రితం సంయుక్త ఆ టాటూ ని వేయించుకున్నట్లుగా కూడా ఆమె తెలిపింది. ఇకపోతే సంచారి అంటే ప్రయాణికుడు అని అర్థం. తనకి ఒంటరిగా ప్రయాణాలు చేయడం అంటే ఇష్టమట. తనకు డల్ గా అనిపించినప్పుడు లేదా అసంతృప్తిగా ఉన్నప్పుడు ఒంటరిగా ప్రయాణాలు చేస్తుందట. అందుకే దానికి సింబాలిక్ గా తను అటాటోని వేయించుకున్నట్లుగా తెలియజేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: